Anushka Ghaati : ఘాటీ కత్తి మాట్లాడుతుంది.. ఇంట్రెస్టింగ్ వైలర్ అవుతున్న అనుష్క పోస్టర్

by Chukka Sudharani |

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’ (Ghaati).

Anushka Ghaati : ఘాటీ కత్తి మాట్లాడుతుంది.. ఇంట్రెస్టింగ్ వైలర్ అవుతున్న అనుష్క పోస్టర్
X

దిశ, సినిమా: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’ (Ghaati). డైరెక్టర్ క్రిష్ (Director Krish) తెరకెక్కిస్తున్న ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ (Female oriented) సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అనుష్క ఫస్ట్ లుక్ (First look), గ్లింప్స్‌ (Glimpses)కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో ‘ఘాటీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ (Positive expectations) మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ (April) 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండటంతో వరుస అప్‌డేట్ ఇస్తున్నారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా తాజాగా అనుష్క శెట్టి తన సోషల్ మీడియా (Social media) అకౌంట్ X ద్వారా తాజాగా ఓ పోస్టర్ షేర్ చేసింది. చేతిలో కొడవలి పట్టుకుని ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘ఘాటీ యొక్క కత్తి మాట్లాడుతుంది’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌లో అనుష్క సీరియస్ లుక్‌లో కనిపించగా.. ఇందులో స్వీటీ మాస్ యాక్షన్‌తో రెచ్చిపోనుందని అర్థం అయింది. ఇక తాజాగా షేర్ చేసిన ఈ పోస్టర్‌తో ఈ హైప్ మరింత క్రియేట్ అవుతోంది. కాగా.. ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Next Story