- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనితో ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ బర్త్‌డే విష్ చేసిన అనుపమ.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మనుపెన్నడు కనిపించని గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లును ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK), ‘పరదా’(Paradha) వంటి సినిమాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనుపమ తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. అందులో ప్రవీణ్ కండ్రెగులతో దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే అని విష్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ వైరల్‌గా మారగా.. నెటిజన్లు అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






