నన్ను చూసి నేనే గర్వపడుతున్నా.. ట్రోలింగ్స్‌పై అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఒకరు.

నన్ను చూసి నేనే గర్వపడుతున్నా.. ట్రోలింగ్స్‌పై అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఒకరు. ప్రజెంట్ ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతో పాటు పలు క్రేజీయెస్ట్ ప్రాజెక్టులు ఒప్పుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ‘బైసన్’(Bison)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో అనుపమ పాత్ర తక్కువగానే ఉన్నప్పటికీ సినిమా హిట్‌లో కీలకంగా మారింది. దీంతో అనుపమపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో భాగంగానే తాజాగా సినిమా సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొని కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది.

‘నా సినిమా కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ట్రోల్స్ ఎదురుకొన్నాను. ముఖ్యంగా నా మొదటి చిత్రం ‘ప్రేమమ్’ (Premam) తర్వాత నాపై వచ్చిన నెగిటివిటీకి చాలా భయపడ్డాను. మలయాళ చిత్ర పరిశ్రమలో అసలు యాక్టింగే రాదు అంటూ ఎంతో విమర్శించారు. అయినా నా ప్రయత్నాలను ఎక్కడా ఆపకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రోజు పొజిషన్‌లో ఉన్నా. ఇప్పుడు నన్ను చూసి నాకే గర్వంగా అనిపిస్తుంది. నటన జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసిన ఫీల్ అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

Next Story