- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anupama Parameswaran: టిల్లు జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు.. మంచి సినిమాలు చేస్తే చూడరు: అనుపమ పరమేశ్వరన్
రీసెంట్‌గా ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

దిశ, సినిమా: రీసెంట్‌గా ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)ను ‘టిల్లు స్వ్కేర్‌లో మిమ్మల్ని చూసి జీర్ణించుకోలేకపోయాను’ అని అభిమాని అనగా.. ‘చూసిన తర్వాత జీర్ణించుకోకపోవడానికి ఏముంది. అయినా మీరు రీసెంట్‌గా వచ్చిన పరదా సినిమా చూశారా.. చూడలేదు. టిల్లు లాంటి సినిమాలు జీర్ణించుకోలేకపోయాము, తట్టుకోలేకపోయాము అంటున్నారు.. పరదా లాంటి మంచి సినిమాలు చేస్తే చూడరు. ఆ సినిమా కూడా చూసుంటే సంతోషించేవారు కదా.. మీరు చూడకపోవడం వల్లే పరదా సినిమా సక్సెస్ కాలేదు’ అంటూ తెలిపింది అనుపమ.
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’. ప్రణీత్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్స్‌లోకి వచ్చి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకోగా.. ఈ రోజు నుంచి తెలుగుతో పాటు మలయాళంలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. లింక్






