Anupama Parameswaran: డబ్బింగ్ స్టూడియోలో ఆ డైరెక్టర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.. అనుపమ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ మూవీ ‘కిష్కింధపురి’.

Anupama Parameswaran: డబ్బింగ్ స్టూడియోలో ఆ డైరెక్టర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.. అనుపమ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ మూవీ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హారర్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్‌లో అనుపమ పరమేశ్వరన్ డైరెక్టర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘మీ అందరికి ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన జానర్ ఇది. చిన్నప్పటి నుంచి కూడా హారర్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. నాకు మూడు సంవత్సరాలు ఉన్నప్పటినుంచే నేను హారర్ ఫిలిమ్స్ చూడటం స్టార్ట్ చేశాను. అలాగే.. మార్నింగ్ లేవగానే నా ముఖం చూసి మా అమ్మ అనేవారు దెయ్యంలా ఉన్నావు అని. అయితే.. ఇన్ని ఇయర్స్‌లో నాకు హారర్ ఫిలిమ్స్‌లో ఆఫర్స్ రాలేదు. నా జుట్టు చూసి కొన్ని స్టోరీస్ వచ్చాయి కానీ.. ఈ సినిమా స్టోరీ డైరెక్టర్ కౌశిక్ వచ్చి చెప్పినప్పుడు నాకు కథ చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే చెప్పిన విషయాల్లో నాకు సగం అర్థం కాలేదు కానీ.. ఆ ఫ్లో నచ్చి సినిమా వెంటనే ఓకే చేశాను.

అది మీకు ఇప్పుడు అర్థం కాదు.. సినిమా చూశాక అర్థం అవుతుంది. కుదిరితే ఒక డిక్షనరీ తీసుకెళ్లండి. అది మీకు సహాయపడుతుంది. ఇలాంటి ఓ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా థాంక్యూ. స్ట్కిప్ట్‌లో ఏముందో దానికంటే బెటర్‌గా సినిమా తీశారు. కౌశిక్‌తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇంతలా డబ్బంగ్ స్టూడియోలో టార్చర్ చేసిన తెలుగు డైరెక్టర్ మరొకరు లేరు. కానీ ఔట్‌ఫుట్ మాత్రం సూపర్ వచ్చింది. ఇది హారర్ మూవీ కాబట్టి.. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా ముఖ్యం. సెప్టెంబర్ 12న ఈ మూవీ రాబోతున్నది. మీ అందరు థియేటర్‌కు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము’ అని తెలిపింది అనుపమ. లింక్


Next Story