- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడలో చామంతిపూలు చీరకట్టుతో దర్శనమిచ్చిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తమిళ చిత్రమైన కోడి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తమిళ చిత్రమైన కోడి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ 2017 జనవరిలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్ సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇక ప్రేమమ్, అఆ, నటసార్వభౌమ, ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ 2, టిల్లు స్వ్కేర్ వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
తన టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్ కేవలం తెలుగులోనే కాకుండా.. మలయాళ, తమిళ చిత్రాల్లో కూడా నటించి జనాల మెప్పు పొందింది. ఇకపోతే అనుపమ అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో టచ్‌లో ఉంటుంది.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. చీరకట్టులో సంప్రదాయ లుక్‌లో అనుపమ స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఆకట్టుకునే జ్యువెలరీ ధరించి, నుదుటన బొట్టు, జడలో చామంతి పూలతో అనుపమ ఫొటో షూట్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ లేటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది.






