Anupama: కర్లీ హెయిర్, కాటుక కళ్లతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోన్న కుర్ర హీరోయిన్..!

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Tollywood heroine Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Anupama: కర్లీ హెయిర్, కాటుక కళ్లతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోన్న కుర్ర హీరోయిన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Tollywood heroine Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ధనుష్ (Dhanush) హీరోగా వచ్చిన తమిళ సినిమా కోడి (Kōḍi)లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇది ఈ బ్యూటీకి తొలి తమిళ సినిమా. ఈమె 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి (Shatamanam Bhavati) సినిమాలో శర్వానంద్‌తో జంటగా నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది.

అనుపమ పరమేశ్వరన్ నటించిన మొట్టమొదటి సినిమా మలయాళంలో వచ్చిన ప్రేమమ్ (Prēmam) ఒకటి. 2015లో విడుదలైన ఈ చిత్రంలో మేరీ జార్జ్ (Mary George) పాత్రలో నటించి మెప్పించింది. తర్వాత ఈ బ్యూటీ జోమోంటే సువిశేషంగల్(Jomonte Suviseshangal) , నటసార్వభౌమ (Natasarvabhauma), ఆఆ(Aaaa), ఉన్నది ఒకటే జిందగీ , కార్తికేయ 2 (Karthikeya 2), టిల్లు స్క్వేర్ (Tillu Square) వంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటిగా మంచి పేరు సంపాదించుకుంది. అనుపమ పరమేశ్వరన్ కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా.. మలయాళ, తమిళ సినిమాల్లో నటించి జనాల మెప్పు పొందింది.

ఇకపోతే ఈ బ్యూటీ అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమాలతో టచ్‌లోనే ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫొటో షూట్లతో యువతను నిత్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. ట్రెడిషన్ అండ్ మోడ్రన్ లుక్‌లో కనిపించి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా మరో కిర్రాక్ ఫొటో షూట్ చేసింది. కర్లీ హెయిర్ .. మత్తెక్కించే కాటుక కళ్లతో నెటిజన్లను ఫిదా చేస్తుంది.

బ్లాక్ మోడ్రన్ డ్రెస్ ధరించి స్టైలిష్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు వావ్, బ్యూటిఫుల్ అంటూ లవ్ సింబల్స్ జోడించి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story