Anupama Parameswaran: న్యాయం కోసం అనుపమ పోరాటం.. కోర్టు బోనులో హీరోయిన్!

by Chukka Sudharani |   (  Updated:2024-12-20 15:38:51  IST  )

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’

Anupama Parameswaran: న్యాయం కోసం అనుపమ పోరాటం.. కోర్టు బోనులో హీరోయిన్!
X

దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs. State of Kerala). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణ (Pravin Narayana) దర్శకత్వం వహిస్తుండగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ ‘జానకి’ పాత్రలో కనిపించనుండగా.. ఆమెపై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంట్రెన్స్ డ్రామాగా రూపొందించారు.

జానకి తరుపున వాదించే లాయర్‌గా ప్రధాన పాత్రలో సురేష్ గోపి (Suresh Gopi) నటిస్తున్నారు. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ (shooting) జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా.. ఈ మూవీలో బైజు సందోష్ (Baiju Sandosh), మాధవ్ సురేష్ గోపి (Madhav Suresh Gopi), దివ్యా పిళ్లై (Divya Pillai), అస్గర్ అలీ (Asghar Ali) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story