మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన అనుపమ

by Chukka Sudharani |   (  Updated:2025-02-18 12:11:56  IST  )

హీరో విక్రమ్ (Vikram) కొడుకు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్’ (Bison).

మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన అనుపమ
X

దిశ, సినిమా: హీరో విక్రమ్ (Vikram) కొడుకు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్’ (Bison). సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ (Mari Selvaraj) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో లాల్, పశుపతి, కలైయ రసన్, రజిష విజయన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదోక స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రంగా తెలుస్తుండగా.. ఇప్పటికే దీని నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ తదితర అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతేడాది స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘ఇది మా బైసన్ కాలమాదన్ యొక్క ఛార్జింగ్ అండ్ ఎనర్జిటిక్ ముగింపు షూట్.. మరిన్ని ఉత్తేజకరమైన అప్‌డేట్‌లు రాబోతున్నాయి’ అంటూ పోస్ట్ పెట్టింది అనుపమా. అలాగే డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఓ ఫొటో షేర్ చేస్తూ.. ‘ఆ రోజులన్నీ విశ్రాంతి లేకుండా పని, అలుపెరగని కృషి అండ్ నిరంతర మద్దతుతో అనంతమైన భావోద్వేగాలతో ఆ రోజులన్నీ నిండిపోయాయి. బైసన్ చత్రం 2025లో రాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.


Click For Tweet..

Next Story