మద్యం మత్తులో అనుపమ.. ప్లీజ్ అక్కడ చూడొద్దంటూ.. 

by Web Desk |
మద్యం మత్తులో అనుపమ.. ప్లీజ్ అక్కడ చూడొద్దంటూ.. 
X

దిశ, సినిమా: సంప్రదాయ నటిగా పేరు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్.. 'రౌడీ ‌బాయ్స్' సినిమాలో లిప్‌లాక్ సీన్స్‌తో ఆ బ్రాండ్‌కు గుడ్ బై చెప్పేసింది. హాట్‌ హాట్ పోజులతో కుర్రాళ్లను రెచ్చగొట్టింది. కానీ ఓ సెక్షన్‌కు ఇలాంటి రోల్‌లో అనుపమ కనిపించడం మింగుడుపడకపోవడంతో.. సోషల్ మీడియా వేదికగా నటి నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంది. అయినా తనకేమీ ఇబ్బంది లేదన్నట్లు వ్యవహరిస్తున్న నటి.. మరోసారి వైన్ గ్లాసుతో దర్శనమిచ్చి నెటిజన్లను రెచ్చగొట్టింది.

ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో షేర్ చేసిన అనుపమ..'కొన్ని రాత్రులను హాయిగా గడిపేందుకే వైన్ తయారు చేస్తారు. దయచేసి ఎడమవైపుకు స్వైప్ చేయవద్దు. అంతకుముందే మత్తెక్కిన నా ముఖాన్ని బహిర్గతం చేయకూడదని అనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. 'మొత్తానికి మత్తు మందలో కలిశావ్ పో' అంటున్నారు నెటిజన్లు.

https://www.instagram.com/p/CZWq8J0rbGV/?utm_source=ig_web_copy_link

Next Story