- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సంవత్సరంలో అదిరిపోయే అవుట్ ఫిట్‌లో అనుపమ.. దిష్టి తీయించుకో అంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమమ్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అఆ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తికేయ-2 వంటి సినిమాల ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక చివరిగా బైసన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది.. ప్రజెంట్ లాక్ డౌన్ సినిమాలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. లేటెస్ట్ ఫొటో షూట్స్, సినిమాలకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా అనుపమ తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది.
అందులో అదిరిపోయే అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. అంతేకాకుండా హెయిర్ లీవ్ చేసుకుని బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకుని కనిపించింది. ఇక దీనికి ‘96’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు దిష్టి తీయించుకో, సూపర్, ఎలాగా ఈ అందం అని, బాపు బొమ్మలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






