- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anu Emmanuel: పింక్ చీరలో అను అందాల విందు
అను ఇమాన్యుయల్ స్టైలిష్ లుక్.. పింక్ చీరలో అదిరిపోయిన అందాలు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రేక్షకులకు అను ఇమాన్యుయల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన ‘మజ్ను’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె తొలి సినిమాతోనే మంచి విజయం మరియు గుర్తింపును సొంతం చేసుకుంది.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. దీంతో క్రమంగా ఈ బ్యూటీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అను ఇమాన్యుయల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కార్తీ హీరోగా తెరకెక్కిన ‘జపాన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆ సినిమా కూడా ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా అను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ ఫోటోల్లో ఆమె పింక్ చీర కట్టుకుని, అందుకు తగిన బ్లౌజ్ ధరించి ఆకట్టుకునే స్టైల్‌లో కనిపించింది.
మెడలో హారం, చేతికి ఉంగరాలు, చెవులకు చెవిపోగులు ధరించిన అను, తన జుట్టును అందంగా ముందుకు వదిలి స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఫోటోల్లో ఆమె ముద్దుగా కనిపించే అందమైన హావభావాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటుండటంతో, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






