Sudip Pandey: ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. గుండె పోటుతో షూటింగ్‌లోనే కన్నుమూసిన యంగ్ హీరో(పోస్ట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-19 11:32:47  IST  )

ప్రముఖ భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే(Sudip Pandey) గుండెపోటుతో కన్నుమూశారు.

Sudip Pandey: ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. గుండె పోటుతో షూటింగ్‌లోనే కన్నుమూసిన యంగ్ హీరో(పోస్ట్)
X

దిశ, సినిమా: ప్రముఖ భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే(Sudip Pandey) గుండెపోటుతో కన్నుమూశారు. ముంబై(Mumbai)లో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే అతను హార్ట్‌ఎటాక్‌(Heart Attak)తో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు, నిర్మాత(Producer) కూడా. అలాగే రాజకీయా(Politics)ల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అలాంటిది ఇంత చిన్న వయసులోనే అతను గుండెపోటుతో మరణించడం అందరినీ కలచివేస్తోంది. ఇక సుదీప్ మరణవార్త విని అతని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇక రీసెంట్‌గా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ముగించుకుని తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం ముంబై వచ్చాడు సుదీప్. ఎప్పటిలాగే బుధవారం( జనవరి 15) ఓ సినిమా షూటింగ్‌కి హాజరయ్యారు. అయితే ఉన్నట్టుండి అతనికి గుండెపోటు రావడంతో అప్రమత్తమైన మూవీ టీమ్ వెంటనే అతన్ని ఆస్పత్రి(Hospital)లో చేర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్స్ వెల్లడించారు. ఇక సుదీప్ మరణ వార్త విషయాన్ని అతని సన్నిహితులు సోషల్ మీడియాలో ధృవీకరించారు.

కాగా సుదీప్ పాండే 2007లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ‘భోజ్‌పురి భయ్యా’ అనే సినిమాతో తక్కువ టైంలోనే యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఖూనీ దంగల్’, ‘మసీహా బాబు’, ‘హమర్ సంగీ బజరంగీ బాలి’, ‘హమర్ లాల్కర్’, ‘షరాబీ’, ‘ఖుర్బానీ’ వంటి సినిమాల్లో సుదీప్ నటించాడు. ఓ పక్క హీరోగా సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అక్కడ ఎన్సీపీ(NCP) పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడీ యంగ్ హీరో.

Next Story