- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకుల బాటలో మరో స్టార్ కపుల్..? వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడుతున్నానంటూ హీరోయిన్ సెన్సేషనల్ నోట్.. ఆందోళనలో ఫ్యాన్స్
మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్(Nazriya Nazeem) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్(Nazriya Nazim) మనందరికీ సుపరిచితమే. ఈ బ్యూటీ ‘రాజా రాణి’(Raja Rani) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తన ఫస్ట్ మూవీతోనే ఫుల్ ఫేమస్ అయింది. అలాగే తన అందం , అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. రీసెంట్‌గా నేచురల్ స్టార్ నాని(Nani) సరసన ‘అంటే సుందరానికి’(Ante Sundaraniki) అనే మూవీలో నటించి మెప్పించింది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అంజలి రచన(anjali Rachana) దర్శకత్వం వహించిన ‘బెంగుళూరు డేస్’(Bengalure Days) చిత్రంలో తనకు కో యాక్టర్‌గా నటించిన ఫహద్ ఫాజిల్(Fahad Fassil)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అలా రియల్ లైఫ్‌లో కూడా భార్యాభర్తలుగా మారిపోయారు. ఇక మ్యారేజ్ తర్వాత ఈ జంట ఓ పక్క మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తునే మరోపక్క తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ రీసెంట్‌గా తెలుగులో ‘పుష్ప 2’(Pushpa-2)తో భారీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే నజ్రియా గత కొద్ది రోజులుగా సైలెంట్ అయింది. ఇటీవల ‘సూక్ష్మ దర్శిని’(Sukshma Darshini) అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత నజ్రియా ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేదని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సినీ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా స్పందించలేదట. దీంతో నజ్రియా భర్త ఫహద్ నుంచి విడిపోతుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా నజ్రియా అందరినీ క్షమించమని కోరుతూ ఓ ప్రెస్ నోట్(Press Note) రిలీజ్ చేసింది. అందులో.. ” మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కొంతకాలంగా ఎందుకు దూరంగా ఉన్నానో పంచుకోవడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను. మీలో చాలా మందికి తెలిసినట్లుగా, నేను ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటాను.
అయితే, గత కొన్ని నెలలుగా.. నా వ్యక్తిగత సవాళ్లతో నేను ఇబ్బంది పడుతున్నాను, నా మనసు కుదురుగా లేదు. అందువల్ల కాస్త డిప్రషన్ లోకి వెళ్లాను. గత కొన్ని నెలలుగా తాను అనేక ముఖ్యమైన కార్యక్రమాలను మిస్ అయ్యాను..నా 30వ పుట్టినరోజు , నూతన సంవత్సర వేడుకలు, నా చిత్రం ‘సూక్ష్మదర్శిని’ విజయంతో పాటు అనేక ఇతర ముఖ్యమైన క్షణాలను నేను మిస్ అయ్యాను నన్ను క్షమించండి. నేను మౌనంగా ఉన్నానో వివరించనందుకు , ఫోన్ కాల్స్ తీసుకోనందుకు లేదా మెసేజెస్‌కు రిప్లే ఇవ్వనందుకు.. నా స్నేహితులందరిని క్షమాపణలు కోరుతున్నాను.
నేను కలిగించిన ఆందోళన లేదా అసౌకర్యానికి నేను నిజంగా చింతిస్తున్నాను. అలాగే పని కోసం నన్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న నా కో స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరిని నేను క్షమాపణలు కోరుతున్నాను. నా వల్ల ఏవైనా అంతరాయాలు జరిగితే నన్ను క్షమించండి. ఇది చాలా కఠినమైన ప్రయాణం, కానీ నేను ప్రతిరోజూ కోలుకోవడానికి, మెరుగుపడటానికి కృషి చేస్తున్నాను. ఈ సమయంలో మీ అవగాహన, మద్దతును నేను అభినందిస్తున్నాను. పూర్తిగా తిరిగి రావడానికి నాకు మరికొంత సమయం అవసరం కావచ్చు, కానీ నేను కోలుకునే మార్గంలో ఉన్నానని హామీ ఇస్తున్నాను.
ఇలా సడన్‌గా అదృశ్యమైనందుకు నా కుటుంబం, స్నేహితులు, అభిమానులందరికీ నేను వివరణ ఇవ్వాలి అనిపించింది కాబట్టి నేను ఈ రోజు దీన్ని రాశాను” అంటూ భావోద్వేగ లేఖ రాసుకొచ్చింది నజ్రియా. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. నజ్రియాకు ఏమైందని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నజ్రియా, ఫహాద్ విడాకులు తీసుకుంటున్నారా అని ఆరా తీస్తున్నారు. అయితే నజ్రియా పోస్ట్ పై స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా స్పందించింది.. ఈ పోస్ట్‌కు లవ్ సింబల్‌ను జోడించి కామెంట్ చేసింది.
Read More..






