- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూవీ ఇండస్ట్రీలో మరో సంచలనం.. ‘పవర్ స్టార్’ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
మూవీ ఇండస్ట్రీలో మరో సంచలనం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఇండస్ట్రీలో మరో సంచలనం చోటుచేసుకుంది. తమిళ ప్రముఖ సినీనటుడు ఎస్.శ్రీనివాసన్ (N Srinivasan) అలియాస్ ‘పవర్‌స్టార్’ను ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం (EOW) ఇవాళ అరెస్ట్ చేసింది. 2018 నుంచి పరారీలో శ్రీనివాసన్ కోర్టులో హాజకానందుకు గాను ఇప్పటికే రెండు సార్లు అతడిని ప్రకటిత నేరస్థుడని వెల్లడించింది. ఓ కంపెనీకి రూ.వెయ్యి కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి శ్రీనివాసన్.. వారి నుంచి రూ.5 కోట్లు లాగేశాడు. ఆ డబ్బును సినిమా నిర్మాణాలు, తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు కంపెనీ శ్రీనివాస్ తమను మోసం చేశాడని కేసు వేసింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ టీమ్స్ చాకచక్యంగా శ్రీనివాస్‌ను చెన్నైలోని వనగరంలో ఉన్నట్లుగా ట్రాక్ చేసి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి శ్రీనివాసన్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
కాగా, శ్రీనివాసన్ అన్నా నగర్‌లో బాబా ట్రేడింగ్ కంపెనీ అనే ఫైనాన్స్ సంస్థను స్థాపించాడు. వ్యాపారవేత్తలు పెద్ద బ్యాంకు రుణాలు పొందడానికి సహాయం చేస్తానని బ్రోకర్ల ద్వారా ప్రచారం చేయించాడు. ఫిర్యాదుదారు కంపెనీకి తాను రూ.1000 కోట్ల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఒప్పందం ప్రకారం ఫిర్యాదుదారుడు శ్రీనివాసన్‌కు డిసెంబర్ 2010లో M/S బాబా ట్రేడింగ్ సెంటర్ కంపెనీకి రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి. అనంతరం వచ్చిన డబ్బును శ్రీనివాసన్ తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాతో పాటు భార్య ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాడు. దీంతో సదరు ఫిర్యాదుదారు శ్రీనివాస్ చేసిన మోసంపై పోలీసులను ఆశ్రయించాడు. మొదట అతడిని 2013లో అరెస్టు చేశారు. కానీ, 2017లో బెయిల్ రావడంతో 2018 నుంచి కోర్టులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.






