- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sunny Devol: బిగ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ లో ప్రముఖ సీనియర్ నటుడు.. హైప్ పెంచుతోన్న ఆసక్తికర కామెంట్స్
నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టు ‘రామాయణ’(Ramayana).

దిశ, వెబ్‌డెస్క్: నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టు ‘రామాయణ’(రామాయణరామాయణ, Ramayana). ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi), యశ్(Yash) నటిస్తున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అల్లు అరవింద్(Allu Arvind) బాలీవుడ్ నిర్మాతలతో కలిసి తెరకెక్కిస్తున్నారు. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్(Planet of the Apes), అవతార్(Avatar) తరహాలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో చాలా పెద్ద సినిమాగా రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు.
అద్భుతమైన విజువల్స్‌తో థియేటర్లను షేక్ చేసేందుకు.. వీఎఫ్‌ఎక్స్ తదితర విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సన్నీదేవోల్(Sunny Devol) రామాయణ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఈయన ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్షర్మ్ అయింది. కానీ తను మూవీలో ఏ రోల్ పోషిస్తున్నారో మాత్రం చెప్పలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సన్నీదేవోల్ హనుమంతుడి పాత్రలో నటించనున్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రస్తుతం సన్నీదేవోల్ ఈ సినిమాలో నటిస్తున్నాడని అధికారికంగా తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రణబీర్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. రామాయణలో అనేకమంది టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్నారని అన్నారు. ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు చెప్పుకొచ్చారు. అలాగే సెకండ్ పార్ట్ కు సంబంధించి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.






