టాలీవుడ్‌లో మరో స్టార్ కాంబో.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..??

by Web Desk |
టాలీవుడ్‌లో మరో స్టార్ కాంబో.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..??
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ హవా నడుస్తోంది. స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించేందుకు నిర్మాతలు సైతం సిద్ధం అవుతున్నారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ దూసుకుపోతున్నారు. తాజాగా 'ఆర్ఆర్ఆర్'తో ఎన్‌టీఆర్, చెర్రితో నెవ్వర్ బిఫోర్ అనేలా రాజమౌళి మూవీని తెరకెక్కించాడు. ఇంతలో మరో భారీ మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోస్ నవీన్ పోలిశెట్టి, విశ్వక్ సేన్ కాంబోలో బిగ్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ మూవీని తెరకెక్కించేందుకు ప్రముఖ సంస్థ రెడీ అయిపోయిందట. ఇప్పటికే ఈ మూవీ కోసం హీరోలిద్దరూ ఓకే అనేశారట. అన్నీ అనుకున్నట్లే జరిగితే సమ్మర్‌లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉందని, త్వరలో దీనిపై క్లారిటీ రానుందని టాక్ వస్తోంది. మరి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పుడొస్తుందో చూడాలి.


Next Story