రామ్ చరణ్- దిల్ రాజు కాంబోలో మరో సినిమా.. అదంతా పుకార్లే అంటూ స్పందించిన టీమ్(ట్వీట్)

by Kavitha |   ( Updated:2025-01-28 12:00:20.0  )
రామ్ చరణ్- దిల్ రాజు కాంబోలో మరో సినిమా.. అదంతా పుకార్లే అంటూ స్పందించిన టీమ్(ట్వీట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) మనందరికీ సుపరిచితమే. ‘చిరుత’(Chirutha) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఫస్ట్ సినిమాతోనే ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా అండ్ ఫిలింఫేర్ అవార్డ్‌తో పాటు నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్‌లో వచ్చిన ‘మగధీర’(Magadheera) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో చరణ్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

అలా ‘రచ్చ’(Racha), ‘ఆరెంజ్’(Orrenge), ‘నాయక్’(Nayak), ‘తుఫాన్’(Tufan), ‘ఎవడు’(Yevadu), ‘గోవిందుడు అందరి వాడేలే’(Govindudu Andarivadele), ‘బ్రూస్ లీ- ది ఫైటర్’(Brusly- The Fighter), ‘ధృవ’(Dhruva), ‘ఖైదీ నెంబర్-150’(Khaidi No-150), ‘రంగస్థలం’(Rangasthalam), ‘వినయ విధేయ రామ’(Vinaya Vidheya Rama), ‘త్రిబుల్ ఆర్’(RRR), ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.

అయితే చివరిగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా అయితే అంతగా మెప్పించలేకపోయింది. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే ‘ఉపాసన’(Upasana)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ జంటకు దాదాపు పెళ్లైన 11 సంవత్సరాలకు క్లీంకార(Kalakaar) అనే పాప 2023లో పుట్టింది. అయితే ఆ మెగా ప్రిన్సెస్ ఫేస్‌ని మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. దీంతో ఆమె ఫేస్‌ని ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchibabu Sanaa) డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ‘Rc-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్- దిల్ రాజు(Dil Raju) కాంబోలో మరో సినిమా రాబోతుందని, ఈ చిత్రానికి రామ్ చరణ్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని, మార్చిలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందని ఓ పుకారు నెట్టింట షికారు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో దీనిపై రామ్ చరణ్ టీమ్ స్పందించింది. ‘ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ మరో సినిమా చేయనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. దిల్ రాజు బ్యానర్‌పై మరో సినిమా ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ బచ్చిబాబు డైరెక్షన్‌లో ‘RC-16’, సుకుమార్‌(Sukumar)తో ‘RC-17’ మాత్రమే చేస్తున్నాడు, దిల్ రాజుతో సినిమా ప్లానింగ్ లాంటిది ఏమీ లేదు అని రాసుకొచ్చారు. దీంతో ఈ పుకార్లు బ్రేక్ పడినట్లు అయిపోయింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed