- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Chaitanya : నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో మరో మూవీ.. ఈసారి హిస్టారీకల్ స్టోరీతో కొట్టబోతున్న హిట్ కాంబో
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ (Tandel) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ (Tandel) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్కినేని రికార్డులు తిరగ రాసేలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాపై అలాగే నాగచైతన్య యాక్టింగ్‌కు సినీ ప్రియులతో పాటు, సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. ఇందులో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటించగా.. చందూ మొండేటి తెరకెక్కించారు. రిలీజ్‌కు ముందు కూడా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోగా.. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తండేల్’ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది. దీంతో ప్రజెంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ‘తండేల్ లవ్ సునామీ’ వేడుకలు పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్ (Success Celebrations) నిర్వహించారు చిత్ర బృందం. దీనికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ తన నెక్ట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. మొదట ‘తండేల్’ సక్సెస్‌పై మాట్లడి తర్వాత.. ‘శోభితా గారు తెలుగు బాగా మాట్లాడతారు. ఆ తెలుగును చైతన్యకు కూడా నేర్పించండి. త్వరలో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథ మళ్లీ ఒక అత్యద్భుతంగా రాసి.. ఈ తరానికి ఏం చెప్పాలి.. తెనాలి రామకృష్ణ.. ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్.. ఒక హిస్టారికల్ క్యారెక్టర్ అది. దాన్ని ఈ తరానికి ఎలా తీసుకురావాలి అనేది.. ఏఎన్నార్‌లా చేసే అభినయం ఆయన చేస్తాడు .. మనం చూస్తాం” అని చెప్పి ముగించాడు.






