చెర్రీ- దిల్ రాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న మరో సినిమా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-19 11:31:18  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాడు.

చెర్రీ- దిల్ రాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న మరో సినిమా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shaker) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Adwani) హీరోయిన్‌గా నటించగా.. దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు(Buchi Babu) డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హీరో రామ్ చరణ్.. దిల్ రాజు ప్రొడక్షన్‌లో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీకి చరణ్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇక ఇప్పటికే దిల్‌రాజు వద్ద ఒక కథ ఉండగా.. ప్రస్తుతం అందులో కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నాయట. కాగా మార్చిలోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click Here For Tweet..

Next Story