- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivakarthikeyan: శివకార్తికేయన్ నుండి మరో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్.. Vfx & విజువల్స్‌తో ఆకట్టుకోనున్న సినిమా!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యేలా చేస్తు్న్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యేలా చేస్తు్న్నాడు. గతేడాది.. ‘అమరన్’ మూవీతో ఆకట్టుకున్న ఆయన.. ప్రస్తుతం తన 25వ చిత్రం ‘పరాశక్తి’తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతో పాటు శిబి చక్రవర్తి డైరెక్టర్‌తో ‘sk-24’ కూడా లైన్ పెట్టాడు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇలా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈయన.. నెక్ట్స్ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ వెంకట్ ప్రభుతో తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేశాడట శివకార్తికేయన్. దీనికి ‘టైమ్ ట్రావెల్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది SK నుండి మరో ఆసక్తికరమైన స్క్రిప్ట్ ఎంపిక అని తెలుస్తుండగా.. వెంకట్ ప్రభు మేకింగ్, Vfx & విజువల్స్‌తో ఈ మూవీ వినోదాత్మకంగా ఉండనుందని టాక్. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా నవంబర్ నుంచి స్టార్ట్ కానుందట. అంతే కాకుండా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
#Sivakarthikeyan's Film With #VenkatPrabhu is said to be a "TIME TRAVEL" Film (©Vp)..🔥👌 Shoot to Kickstart From Nov..👍
— Laxmi Kanth (@iammoviebuff007) June 8, 2025
Another Interesting Choice of Script From SK..🤝 Hope Venkat Prabhu Delivers an Entertaining One with Good Making, Vfx & Visuals..✌️ pic.twitter.com/pdjl5zV5Bh






