- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టాక్సిక్’ మూవీ నుంచి మరో హాట్ బ్యూటీ ఫస్ట్ లుక్ విడుదల.. డేంజరస్ షేడ్స్‌లో భయపెట్టిస్తుందిగా!
'టాక్సిక్' మూవీ నుంచి హాట్ బ్యూటీ ఫస్ట్ లుక్ విడుదల.

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీటీమ్. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘పెద్దల కోసం ఒక విషపూరిత అద్భుత కథ - రెబెక్కాగా తారా సుతారియాను పరిచయం చేస్తున్నాము’ అంటూ రాసుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో తారా సుతారియా రెబెక్కా రోల్‌లో యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. మోడ్రన్ డ్రెస్సులో, చేతిలో గన్ పట్టుకుని, కళ్లలో ఫైర్‌తో తారా సుతారియా లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పవర్‌ఫుల్, డేంజరస్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌గా తారా పాత్రను డిజైన్ చేసినట్లు పోస్టర్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






