- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కన్నప్ప సినిమా విడుదలను అడ్డుకుంటాం’
మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా(Kannappa Movie) మరో వివాదంలో చిక్కుకున్నది. పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా(Kannappa Movie) మరో వివాదంలో చిక్కుకున్నది. పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్‌లో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక(Brahmana chaitanya Vedika) సభ్యులు శివలింగానికి అభిషేకం చేశారు. సినిమాలో పిలక, గిలక పాత్రలు తీసేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. నిరసన అనంతరం సినిమా విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకుంటామనీ ప్రకటించారు.
మరోవైపు ఇప్పటికే కన్నప్ప చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన దృశ్యాలు, డేటా ఉన్న హార్డ్ డ్రైవ్ మాయం అయినట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మిస్ అయిన హార్డ్ డిస్క్‌లో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్షన్ సీన్లు ఉన్నాయని హీరో మంచు విష్ణు తెలిపారు. సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపించనున్నారని మంచు విష్ణు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే చిత్రంపై బ్రహ్మణ సంఘాలు కోర్టుకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.






