Meenakshi Chaudhary: మరో స్టార్ హీరో సినిమాలో చాన్స్ అందుకున్న మీనాక్షీ చౌదరి.. నెట్టింట పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.

Meenakshi Chaudhary: మరో స్టార్ హీరో సినిమాలో చాన్స్ అందుకున్న మీనాక్షీ చౌదరి.. నెట్టింట పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. దీంతో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో.. అనగనగా ఒకరాజు, NC-24 వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే రీసెంట్‌గా ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తుంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో సినిమాలో చాన్స్ అందుకున్నట్లు తమిళ ఇండస్ట్రీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రజెంట్ తన 63వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ‘Chiyaan 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 'మండేలా' అండ్ 'మావీరన్' ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌గా మీనాక్షీ చౌదరిని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే చర్చలు జరపగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా.. సత్యరాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి అమృత్‌రామ్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Next Story