‘ది ప్యారడైజ్’ నుంచి మరో అదిరిపోయే అప్డేట్

by Chukka Sudharani |

‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’తో సంచలన విజయం సాధించారు.

‘ది ప్యారడైజ్’ నుంచి మరో అదిరిపోయే అప్డేట్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’తో సంచలన విజయం సాధించారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని ట్రెండింగ్ వన్‌లో నిలిచి సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఇందులో భాంగంగానే సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్ రెండో సాంగ్‌ను మే 10 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆయా షేర్‌తో హీరోయిజం చూస్తే.. ఇప్పుడు వచ్చే సాంగ్‌తో లవ్ యాంగిల్ చూస్తారు’ అని చెప్పుకొచ్చారు.

కాగా.. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా.. ఇందులో నాని డిఫరెంట్ లుక్‌పై ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ రావడంతో.. ఈ సినిమాను ఆగస్టు నాటికి థియేటర్స్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story