- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Deverakonda: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటన విడుదల.. ఖుషీలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ‘వీడీ-12’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పోస్టర్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. దీంతో పాటు ఆయన ‘వీడీ-14’ కూడా చేస్తున్నారు.
ఇటీవల దీనికి సంబంధించిన పోస్టర్(Poster) కూడా విడుదలైంది. కానీ మళ్లీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఆగిపోయిందనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ క్రమంలో.. తాజాగా, రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ ‘వీడీ-14’ కార్యక్రమాలు పూర్తి అయినట్లు మేకర్స్ సోషల్ మీడియా(Social Media) ద్వారా తెలుపుతూ పలు ఫొటోలను షేర్ చేశారు.
అయితే ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్(Rahul Sankrityan) దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఇది పీరియాడిక్ యాక్షన్ ఫిలిం అని తెలుస్తుంది. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథగా, విజయ్ దేవరకొండని ఓ యోధుడిగా చూపించబోతున్నారు అని సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఖుషీ అవుతున్నారు. రౌడీ హీరో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడని అంటున్నారు.
#VD14 update: Set work started today with an auspicious pooja. A great tale on colonial history laid its first brick on our 76th Republic day. Am sure this film is going to be one of the most powerful films ever made on the Colonial history(unspoken) of India. @TheDeverakonda… pic.twitter.com/rzdHZfIHM5
— Rahul Sankrityan (@Rahul_Sankrityn) January 26, 2025






