అన్నగారు.. రియల్‌ హీరోగా మారిన పోలీస్ ఆఫీసర్

by Sujitha Rachapalli |

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ "అన్నగారు వస్తారు" ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్

అన్నగారు.. రియల్‌ హీరోగా మారిన పోలీస్ ఆఫీసర్
X

దిశ, సినిమా : స్టార్ హీరో కార్తీ ‘అన్నగారు వస్తారు’ సినిమాతో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ యాక్షన్ కామెడీకి నలన్ కుమారస్వామి దర్శకులు కాగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ కాగా టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కంప్లీట్ ఎంగేజింగ్‌గా ఉందని.. థియేటర్స్‌లో సినిమా చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని ప్రశంసించారు దర్శకుడు హరీశ్ శంకర్. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న సరదా పోలీస్ ఆఫీసర్ కార్తీకి బాల్యం నుంచే సినిమాతో అనుబంధం ఏర్పడుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్ల ప్రజల్లో మర్యాద పెరగాలని సఫారీతో యూనిఫామ్ కుట్టించుకుంటాడు. హీరోయిన్‌ను కలిసినప్పుడు జాలీ టు మీట్ యూ అని రొమాంటిక్ గా పలకరిస్తాడు. మరోవైపు చేతివాటం చూపిస్తుంటాడు. అయితే సమాజానికి ఒక రియల్ హీరో అవసరమైనప్పుడు అన్నగారిలా అరంగేట్రం చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ కార్తీ.. అన్నగారులా ఎలా వచ్చారనేదే స్టోరీ. కాగా హీరో స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది.

Next Story