పవన్ కల్యాణ్ కోసం ఎమోషనల్ మెసేజ్ షేర్ చేసిన అన్నా కొణిదెల

by Pulgam srinivas |   (  Updated:2026-07-12 07:10:02  IST  )

పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన ఇన్‌స్టా స్టోరీలో PKCW విడుదల చేసిన 'గెట్ వెల్ సూన్ పవన్ కల్యాణ్' సందేశాన్ని షేర్ చేశారు.

పవన్ కల్యాణ్ కోసం ఎమోషనల్ మెసేజ్ షేర్ చేసిన అన్నా కొణిదెల
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (PKCW) విడుదల చేసిన ప్రత్యేక సందేశాన్ని షేర్ చేశారు. ఆ సందేశంలో, "మా వ్యవస్థాపకుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు విజయవంతమైన శస్త్రచికిత్స అనంతరం త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.

ఎన్నో జీవితాలను తాకిన ఆ చేతులు, లక్షలాది మంది ఆశలను మోసిన ఆ భుజాలు, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆ పిడికిలి మునుపటి కంటే మరింత బలంగా తిరిగి వస్తుంది. మీ అంకితభావం, ప్రజాసేవ పట్ల మీ నిబద్ధత కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మీరు త్వరగా కోలుకుని మరింత శక్తివంతంగా ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాం" అని పేర్కొన్నారు. అన్నా కొణిదెల ఈ సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో హైలైట్ చేయడంతో అభిమానులు మరింత భావోద్వేగానికి గురయ్యారు. #GetWellSoonPawanKalyan హ్యాష్‌ట్యాగ్‌తో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Next Story