Anjana Rangan: చీరకట్టులో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న క్రేజీ యాంకర్ అంజనా రంగన్

by Pulgam srinivas |   (  Updated:2026-06-02 06:09:55  IST  )

గ్రీన్ శారీలో సింపుల్ లుక్‌తో మెరిసిన అంజనా రంగన్

Anjana Rangan: చీరకట్టులో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న క్రేజీ యాంకర్ అంజనా రంగన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ తమిళ యాంకర్ అంజనా రంగన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈమె అద్భుతమైన యాంకర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన అంజనా తాజాగా ‘పెద్ది’ సినిమా తమిళ ప్రమోషన్లలో భాగంగా హీరో రామ్ చరణ్‌ను కూడా ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచింది. బుల్లితెరపై ప్రేక్షకులతో ఎంత టచ్‌లో ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో యాక్టివ్‌గా కనిపిస్తూ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక తన అందాల ఆరబోత విషయంలోనూ అంజనా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది.

గ్రీన్ కలర్ శారీలో, రెడ్ కలర్ బ్లౌజ్ ధరించి ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన అంజనా, చీర పవిటను కాస్త పక్కకు జరిపి క్యూట్ స్మైల్‌తో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో తన కురులను ఒక వైపు భుజంపై వాల్చి మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

ఇక ఆమె ధరించిన పెద్ద ఇయర్ రింగ్స్ లుక్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. నుదుటిపై చిన్న బొట్టు, చేతికి గాజులు, వేళ్లకు ఉంగరంతో అంజనా మరింత అందంగా మెరిసిపోయింది. మొత్తంగా ఈ ఫొటోల్లో ఆమె లుక్ అద్భుతంగా ఉండడంతో నెటిజన్లు భారీగా లైక్స్, కామెంట్స్‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Photos Courtesy: Instagram

Next Story