మకుటంలో నా పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుంది

by Chukka Sudharani |   (  Updated:2026-06-29 16:58:25  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మకుటం’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్‌ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.

మకుటంలో నా పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుంది
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిలిమ్ బ్యానర్‌పై దివంగత ఆర్ బీ చౌదరి నిర్మించిన ఈ మూవీలో అంజలి, దుషారా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్‌ను రిలీజ్ చెయ్యగా.. నెట్టింట సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి ‘మకుటం’ చిత్రంలో తన పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మదగదరాజా’ తరువాత విశాల్‌తో చేసిన సినిమా ఇది. అప్పుడు విశాల్‌ హీరో.. ఇప్పుడు దర్శకుడు కూడా. ఇందులో నేను ఓ మంచి, పవర్‌ ఫుల్‌ రోల్‌ చేశా. మా ఇద్దరికీ 15 ఏళ్ల అనుబంధం ఉంది. ‘మకుటం’తో విశాల్‌కు దర్శకుడిగా పెద్ద విజయం దక్కాలి. జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ ఎప్పుడూ బాగుంటుంది. ఇందులో ‘నచ్చాకే వచ్చేరా’ పాట నాకెంతో ఇష్టం’. ఈ చిత్రాన్ని నిర్మించిన ఆర్ బీ చౌదరి గారు మా మాధ్య ఉన్నట్లు అనిపిస్తుంది.. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story