ఆ సినిమా ఓటీటీ విడుదల రద్దు కావడానికి అనిల్ రావిపూడి కారణం: బన్నీ వాసు

by Pulgam srinivas |

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్ర కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ... ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి అనిల్ రావిపూడి కారణం. ఆయన మంచి కంటెంట్ ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని చెప్పినట్లు బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

ఆ సినిమా ఓటీటీ విడుదల రద్దు కావడానికి అనిల్ రావిపూడి కారణం: బన్నీ వాసు
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా సమయంలో ఎక్కువ శాతం సినిమాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలలో విడుదలయ్యాయి. అందుకు ప్రధాన కారణం పూర్తయిన సినిమాను థియేటర్లలో విడుదల చేసే వీలు లేకపోవడం. ఒకవేళ వీలున్నా కూడా ఆ సమయంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. దానితో నిర్మాతలకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇక థియేటర్లకి జనాలు పూర్తిగా వచ్చేంత సమయం కోసం వేచి చూస్తే నిర్మాత ఆర్థికంగా నష్టపోతాడు.

అందుకోసం ఎంతో కొంత మేర సురక్షితమని చెప్పేసి ఓటీటీలకి సినిమాలను అమ్మేశారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం పెద్దగా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల కావడం లేదు. కొన్ని మాత్రమే విడుదల అవుతున్నాయి. తాజాగా శివాజీ, లయ జంటగా రూపొందిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతా సిద్ధమైంది అనుకునే లోపు ఈ సినిమా డిజిటల్ విడుదలను రద్దు చేసి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ... ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి అనిల్ రావిపూడి గారు కారణం. ఆయన సినిమా చూసి ఇంత మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని ఆయన పట్టుబట్టారు. దానితో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నామని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.

Next Story