- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేష్ చిరంజీవి నెక్స్ట్ నాగార్జునా? అనిల్ రావిపూడి సమాధానం ఇదే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశాడు. వెంకటేష్ తో చేశారు, చిరంజీవితో చేశారు మరి నాగార్జునతో ఎప్పుడు చేస్తారని అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారని హలో బ్రదర్ లాంటి సినిమా కావాలని అనుకుంటున్నారని రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి అనిల్ రావిపూడి సమాధానం ఇస్తూ.. అనుకోవడమే చేయాలని గట్టిగా అనుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారని చెప్పాడు. అలా తదాస్తు అంటే అయిపోతుందని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే మనశంకరవరప్రసాద్ సినిమా ఈ సంక్రాంతికి మెగాస్టార్ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. దీంతో అభిమానులు థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.






