Anil Ravipudi: రెండున్న‌ర గంట‌లు టైం మిష‌న్ ఎక్కించి ఫ్యాన్స్ ను గిర్రన తిప్పుతా

by velandi.Saikiran |

మన శంకర్ వరప్రసాద్ గారు నడిచే రెండున్నర గంటల పాటు, అభిమానులను టైం మిషన్ ఎక్కించి గిర్రున తిప్పుతాను అంటూ శపథం చేశారు అనిల్ రావిపూడి.

Anil Ravipudi: రెండున్న‌ర గంట‌లు టైం మిష‌న్ ఎక్కించి ఫ్యాన్స్ ను గిర్రన తిప్పుతా
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేసింది చిత్రం బృందం. ట్రైలర్ లాంచ్ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించి మరి, విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కెరీర్ లో నిలిచిపోయేలా మన శంకర వరప్రసాద్ సినిమా తీసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు అనిల్.

ఒక గ్యాంగ్ లీడర్, ఆటో జానీ లాంటి సినిమాల్లోని పాత్రలను ఒడిసిపట్టి, చిరంజీవి టైమింగ్ ను పూర్తిగా వాడుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా నడిచే రెండున్నర గంటల పాటు, అభిమానులను టైం మిషన్ ఎక్కించి గిర్రున తిప్పుతాను అంటూ శపథం చేశారు అనిల్ రావిపూడి. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ పై.. విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. రొట్ట కామెడీ ఉందంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నయనతార హీరోగా చేస్తుండగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. క్లిక్

Next Story