- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో రొమాంటిక్ చిత్రంతో అనీత్ పడ్డా ఎంట్రీ
‘సైయారా’ చిత్రంతో బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా.

దిశ, సినిమా: ‘సైయారా’ చిత్రంతో బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా. తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే.. రీసెంట్‌గా ఓ హారర్ కామెడీ చిత్రాన్ని ఓకే చేసింది. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ‘శక్తి శాలిని’ చిత్రంలో నటిస్తుంది. బెంగాలీ జానపద కథల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శక్తి, శాలిని అనే రెండు విభిన్న పాత్రల్లో మెప్పించేందుకు సిద్ధం అవుతున్నది. ఈ చిత్రంతో పాటు ఇప్పుడు మరో ప్రాజెక్టుకు ఓకే చేసింది.
తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇస్తూ.. ‘ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి! YRF బ్యానర్‌పై అనీత్ పడ్డా నటిస్తున్న రొమాంటిక్ చిత్రం ‘సత్రంగా’కు సంబంధించిన అదిరిపోయే పోస్టర్ వచ్చేసింది’ అంటూ ఓ క్యూట్ పోస్టర్ షేర్ చేయగా.. ప్రజంట్ ఆ పోస్టర్ ఆకట్టుకుంటోండి. కాగా.. అహాన్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు.






