- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఒక సాధకుడిగా ఉండాలంటే, మీరు ఒక విశ్వాసిగా ఉండాలి’.. టాలీవుడ్ నటుడి సతీమణి పోస్ట్ వైరల్
కేరళ(Kerala)కు చెందిన ఆమె అయిన తెలుగులో అనర్గళంగా మట్లాడుతూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు దక్కించుకుంది కనకాల సుమ(Kanakala Suma).

దిశ, వెబ్‌డెస్క్: కేరళ(Kerala)కు చెందిన ఆమె అయిన తెలుగులో అనర్గళంగా మట్లాడుతూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు దక్కించుకుంది కనకాల సుమ(Kanakala Suma). టీవీలో వేల ఎపిసోడ్లు ప్రసారమైన స్టార్ మహిళ(Sṭār mahiḷa)తో బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన సుమ మంచి పేరు సంపాదించుకుంది. స్టార్ మహిళత పాటు, పంచావతారం(Panchavataram), భలే చాన్సులే (Bhale cansule), క్యాష్ (Cash), సూపర్ సింగర్ (Super singer), జీన్స్ (Jeans), అవాక్కయ్యారా (Avakkayyara), పట్టుకొంటే పట్టుచీర , లకకు కిక్కు వంటి టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకుల్ని అలరించింది. ఈమె కేవలం టీవీ షోల్లోనే కాకుండా.. కళ్యాణ ప్రాపిరస్తు, కలిసి నడుద్దాం, పవిత్ర ప్రేమ, ఢీ, బాదుషా, స్వయంవరం, రావోయి చందమామ, గీతాంజలి, రాఘవ, స్వరాభిషేకం, పండంటి సంసారం, జయమ్మ పంచాయతీ వంటి సినిమాల్లో కూడా నటిగా చేసింది.
సుమకు ఉత్తమ టీవీ వ్యాఖ్యాతగా స్టార్ మహిళకు సినీ గోర్ పురస్కారాన్ని(Cine Gore Award) అందుకుంది. ఈ యాంకర్ చక్కగా మాట్లాడుతూ.. చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఇప్పటికీ రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలో కూడా చక్కగా మాట్లాడగలదు. ఇకపోతే సుమ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంది. తాజాగా ఈ యాంకర్ జీన్స్ ధరించి.. ‘ఒక సాధకుడిగా ఉండాలంటే, మీరు ఒక విశ్వాసిగా ఉండాలి’ అంటూ ఓ క్యాప్షన్ జోడించింది. అలాగే నవ్వడానికి ఎల్లప్పుడూ కారణాలు ఉంటాయంటూ మరో పోస్ట్ కూడా పెట్టింది.






