రెయిన్ బో శారీలో నడుము అందాలు ఆరబోస్తున్న శ్రీముఖి.. కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోన్న పోస్ట్ వైరల్

by Kodari Anjali |

తెలుగులో టాప్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

రెయిన్ బో శారీలో నడుము అందాలు ఆరబోస్తున్న శ్రీముఖి.. కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోన్న పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో టాప్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని తన మాట తీరుతో మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది ఈ బ్యూటీ. కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా.. శ్రీముఖి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది.

టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా అవకాశం కొట్టేసి.. అద్భుతమైన నటనతో తన టాలెంట్ నిరూపించుకుంది. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి-శ్రీముఖి మధ్య వచ్చిన సన్నివేశాలు జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అండ్ భూమిక నటించిన ఖుషి సినిమాలోని నడుము సీన్‌ను మెగాస్టార్ చిరంజీవి అండ్ శ్రీముఖి చేశారు. ఇకపోతే ఈ భామ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

తరచూ ట్రెడిషనల్ అండ్ మోడ్రన్‌గా అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. ఎక్కువ ఈ అమ్మడు నిండైన బట్టలతోనే దర్శనమస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా శ్రీముఖి రంగురంగుల చీర కట్టింది. నడుము అందాలు ఆరబోస్తూ ఖతర్నాక్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోలు వీక్షించిన నెటిజన్లు లుకింగ్ లైక్ రెయిన్ బో కలర్స్ శారీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story