ఇప్పటివరకు అత్యుత్తమ పుట్టినరోజు ఇదేనంటూ యాంకర్ శ్రీముఖి పోస్ట్.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు

by Kodari Anjali |

తెలుగులో టాప్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

ఇప్పటివరకు అత్యుత్తమ పుట్టినరోజు ఇదేనంటూ యాంకర్ శ్రీముఖి పోస్ట్.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో టాప్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని తన మాట తీరుతో మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. ఈ బ్యూటీ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా.. శ్రీముఖి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సుల కొట్టేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది.

టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా అవకాశం కొట్టేసి.. అద్భుతమైన నటనతో తన టాలెంట్ నిరూపించుకుంది. భోళాశంకర్ చిత్రంలో చిరంజీవి-శ్రీముఖి మధ్య వచ్చిన సన్నివేశాలు జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన పలువురు సన్నిహితులు, అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా బర్త్ డే సందర్భంగా శ్రీముఖి టెంపుల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఇప్పటివరకు అత్యుత్తమ పుట్టినరోజు ఇదేనంటూ ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story