షాకింగ్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యాంకర్.. గూడ్స్ ట్రైన్‌లా ఒకే డ్రెస్‌పై అన్నీ ఫొటోలెందుకక్కా?.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-05-27 12:05:33  IST  )

తెలుగులో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది శ్రీముఖి. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

షాకింగ్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన యాంకర్.. గూడ్స్ ట్రైన్‌లా ఒకే డ్రెస్‌పై అన్నీ ఫొటోలెందుకక్కా?.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది శ్రీముఖి. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా.. సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా అవకాశం కొట్టేసి.. అద్భుతమైన నటనతో తన టాలెంట్ నిరూపించుకుంది.

భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి, శ్రీముఖి మధ్య వచ్చిన సన్నివేశాలు జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే నేడు ఈ ముద్దుగుమ్మ ఇటు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే అటు వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో దర్శనమిస్తుంటుంది. కొన్నిసార్లు సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే ఫొటో షూట్లు చేస్తుంటుంది.

మరికొన్నిసార్లు మోడ్రన్ లుక్‌లో దర్శనమివ్వగా.. మరీ బోల్డ్‌గా మాత్రం అస్సలు కనిపించదు. కాగా తాజాగా శ్రీముఖి తాజాగా హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. స్కై బ్లూ కలర్ పొట్టి డ్రెస్ ధరించి తన అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓ వైపు దగదగ మెరుస్తోన్న చంకీల డ్రెస్ హైలెట్ అవ్వగా.. మరోవైపు తన థైస్ షో నెటిజన్లను కుదురుగా ఉండనివ్వడం లేదు.

అయితే ఈ ఫొటోలు గమనించిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. గుడ్ లుకింగ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఒకే డ్రెస్‌పై గూడ్స్ ట్రైన్‌లా అన్ని ఫొటోలెందుకు అక్కా అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం నెట్టింట్లో శ్రీముఖి కొత్త లుక్స్ వైరల్ అవుతున్నాయి.

Next Story