యాంకర్ రష్మీ క్రేజీ స్టిల్స్.. వదినా అంటూ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-05-27 04:11:45  IST  )

జబర్దస్త్ యాంకర్ రష్మీ(Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

యాంకర్ రష్మీ క్రేజీ స్టిల్స్.. వదినా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ యాంకర్ రష్మీ(Rashmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. కానీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. దీంతో ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్ షో’(Jabardasth Show)కు యాంకర్‌గా వ్యవహరించసాగింది.ఇప్పటికీ ఆ షోకు యాంకరింగ్ చేస్తూ మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ షో’(Sridevi Drama Company Show)కు కూడా యాంకరింగ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ నెట్టింట సెగ చేస్తోంటుంది రష్మి.

లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రష్మి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్, కొప్పు పెట్టుకుని, బొట్టు గాజులతో రెడీ అయింది. అలాగే కొన్ని ఫొటోస్‌కి క్రేజీగా స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వదినా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుధీర్(Sudheer)- రష్మీ బెస్ట్ రీల్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Next Story