- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ యాంకర్ గొప్ప మనసు.. నాన్నకు ప్రేమతో అదిరిపోయే ట్రీట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లకు కొడుకువలేదు. చాలామంది ఇండస్ట్రీలో యాంకర్లు... రాణిస్తున్నారు. ఇందులో కొంతమంది

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లకు కొడుకువలేదు. చాలామంది ఇండస్ట్రీలో యాంకర్లు... రాణిస్తున్నారు. ఇందులో కొంతమంది తొందరగా సక్సెస్ అయితే మరి కొంతమంది చాలా కష్టపడుతున్నారు. అయితే అప్పట్లోనే ఇండస్ట్రీని ఊపు ఊపిన... యాంకర్లు కూడా ఉన్నారు. అలాంటి యాంకర్లలో లాస్య ( Anchor Lasya) ఒకరు. అలాంటి యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అప్పట్లో రవి ( Ravi), లాస్య చేసే షోలకు మంచి ఫాలోయింగ్ ఉండేది. వీళ్ళిద్దరి షో వచ్చిందంటే... టీవీల ముందు జనాలు కూర్చునేవారు. అయితే యాంకర్ లాస్య పెళ్లి తర్వాత... ఆమె పెద్దగా రాణించడం లేదు. ఇది ఇలా ఉండగా.. యాంకర్ లాస్య తాజాగా అదిరిపోయే కారు కొనుగోలు చేసింది. 10 లక్షలు పెట్టి టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz ) కారును కొనుగోలు చేసింది లాస్య.
ఫాదర్స్ డే ( Fathers Day) సందర్భంగా... తన తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తన తండ్రి కారులో తిరిగితే చూడాలనేది.. కోరిక అని... అందుకే కారు కొనిచ్చినట్లు వెల్లడించింది. పెళ్లి తర్వాత తాను కొనుగోలు చేసిన కారుకు ఈఎంఐ మాత్రం... నాన్నగారు కట్టారని... గుర్తుచేసింది. ఇక ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉండటంతో... తన తండ్రికి కారు కొనిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కారుకు పూజ చేసిన ఫోటోలను పంచుకుంది.
Instagramme link






