యాంక‌ర్ అన‌సూయ‌కు వేధింపులు..ఏకంగా 73 మందిపై కేసులు !

by velandi.Saikiran |   (  Updated:2026-01-16 13:18:11  IST  )

కాంగ్రెస్ పార్టీ నేత బొజ్జ సంధ్యారెడ్డి, పలు న్యూస్ టీవీలో యాంకర్లు, సోషల్ మీడియా స్టార్లు ఉన్నారు.

యాంక‌ర్ అన‌సూయ‌కు వేధింపులు..ఏకంగా 73 మందిపై కేసులు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సీనియర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వేలు పెట్టిన అనసూయ, దారుణమైన ట్రోలింగ్ కు గురైంది. అయితే ఈ నేపథ్యంలో నటి అనసూయను ఆన్లైన్ లో వేధించి, ట్రోలింగ్ చేసిన 73 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. బొజ్జ సంధ్యారెడ్డితో పాటు ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ భాష, రజినీ లాంటి ప్ర‌ముఖుల‌పై కేసులు న‌మోదు అయ్యాయి.

ఈ లిస్టులో కాంగ్రెస్ పార్టీ నేత బొజ్జ సంధ్యారెడ్డి, పలు న్యూస్ టీవీలో యాంకర్లు, సోషల్ మీడియా స్టార్లు ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. యాంకర్ అనసూయను ఉద్దేశించి రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలను మీడియాలో ప్రచారం చేశారని ఆమె ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మహిళల రక్షణ పట్ల శ్రద్ధ ఉంటే, సంధ్య అనే మహిళ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సింగర్ చిన్మయి. దీంతో సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అసలు ఏంటి అనసూయ వివాదం ?

దండోరా సినిమా నేపథ్యంలో నటుడు శివాజీ, మహిళల సామాన్లు అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలు చీరలు మాత్రమే కట్టుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శివాజీ. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలకు అనసూయ కౌంటర్ ఇచ్చారు. మా శరీరం మా ఇష్టం.. నీకేంటి నొప్పి అంటూ శివాజీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అనసూయ. దీంతో ఈ వివాదం రాజుకుంది. ఇలాంటి నేపథ్యంలో 73 మందిపై కేసులు నమోదు అయ్యాయి.

Next Story