- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనసూయతో డైరెక్టర్ సెల్ఫీ.. మరీ అలా ఉండేసరికి.. భర్తను ఏకిపారేసిన నెటిజన్లు..
జబర్దస్త్ యాంకర్ అనసూయ.. కెరీర్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీకి ఏ ముహూర్తాన ఎంట్రీ ఇచ్చిందో కానీ మూడు పువ్వులు ఆరు కాయలుగా దూసుకుపోతుంది. బయట ఎంత విమర్శలు ఎదుర్కొన్నా.. సినిమా పరంగా మాత్రం..

దిశ, వెబ్ డెస్క్ : జబర్దస్త్ యాంకర్ అనసూయ.. కెరీర్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీకి ఏ ముహూర్తాన ఎంట్రీ ఇచ్చిందో కానీ మూడు పువ్వులు ఆరు కాయలుగా దూసుకుపోతుంది. బయట ఎంత విమర్శలు ఎదుర్కొన్నా.. సినిమా పరంగా మాత్రం.. చేసిన ప్రతి క్యారెక్టర్‌కు న్యాయం చేసిందనే అంటారు జనాలు. కొన్ని సీన్స్‌లో పీక్ ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయిందనే ప్రశంసలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఆంటీ అంటే పొట్టుపొట్టు తిట్టే అనసూయతో బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఫన్నీ కన్వర్జేషన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అనసూయతో ఓ సారి సెల్ఫీ తీసుకున్నానని.. అందంగా ఉంది కదా అని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ పెట్టానని తెలిపాడు డైరెక్టర్. అయితే ఆ ఫోటోలో ఉన్నది అనసూయ భర్త అనుకుని ఏకిపారేశారని చెప్పుకొచ్చాడు. నీకు ఇలాంటోడు ఎక్కడ దొరికాడంటూ బండ బూతులు తిట్టారని గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. ఇక ఈ వీడియో వైరల్ కాగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. అనసూయ భర్త కంటే నువ్వే బాగున్నావ్ బ్రో అంటున్నారు.






