చీర వివాదం: తన స్టైల్లోనే ధీటుగా బదులిచ్చిన అనసూయ భరద్వాజ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-11 12:58:34  IST  )

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తనపై వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చే నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు.

చీర వివాదం: తన స్టైల్లోనే ధీటుగా బదులిచ్చిన అనసూయ భరద్వాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తనపై వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చే నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె కట్టుకున్న చీరపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దానికి "శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ" అనే థంబ్‌నైల్‌ను జోడించి కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. దీనిపై అనసూయ తనదైన శైలిలో స్పందించారు. ఆ థంబ్‌నైల్, వీడియోపై అనసూయ సీరియస్ అయ్యారు. అనవసరంగా తన వ్యక్తిగత విషయాలను ఇతరులతో ముడిపెట్టడంపై ఆమె మండిపడ్డారు. "అంతకుముందు మేము చీరలు కట్టుకోలేదా?" అని ఆమె పరోక్షంగా మండిపడ్డారు. ఒక నటిగా తనకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు తనకు ఉందని, ఎవరో ఏదో అన్నారని తన జీవనశైలిని మార్చుకోలేదని ఆమె ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసలు వాస్తవాలు తెలుసుకోకుండా థంబ్‌నైల్స్ పెట్టడం సరికాదని ఆమె గతంలోనే హితవు పలికారు. అనసూయ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఈ వివాదంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా, తనపై వచ్చే ఆరోపణలను చూస్తూ ఊరుకోకుండా, వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడం అనసూయ ప్రత్యేకత అని ఆమె అభిమానులు అంటున్నారు.

చిత్రాంగద సింగ్‌కు షాక్.. దయచేసి ఆ మెసేజ్‌లను పట్టించుకోకండి అంటూ ఎమోషనల్ పోస్ట్

Next Story