- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవి చేతకానివాళ్ల మాటలు.. శివాజీపై అనసూయ మరోసారి ఫైర్
టాలీవుడ్ నటుడు శివాజీపై యాంకర్ అనసూయ మరోసారి ఫైర్ అయ్యారు. అతి వినయం ధూర్త లక్షణం అని అన్నారు. అమ్మా.. తల్లి అని మాట్లాడేవాళ్లే చాలా డేంజర్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు శివాజీపై యాంకర్ అనసూయ మరోసారి ఫైర్ అయ్యారు. అతి వినయం ధూర్త లక్షణం అని అన్నారు. అమ్మా.. తల్లి అని మాట్లాడేవాళ్లే చాలా డేంజర్ అన్నారు. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళుతుందని ఈక్వాలిటీ ఉండాలనే తాను కూడా చెబుతానని అన్నారు. కానీ బట్టల గురించి మాట్లాడటం చేతగాని తనం అని విమర్శించారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఇన్ సెక్యురిటీ సెల్ఫ్ కంట్రోల్ లేనివాళ్లు ఇతరులను కంట్రోల్ చేయాలని చూస్తారని అన్నారు.
జాలి పోగు చేసుకుంటూ కూర్చుంటున్నారు కాబట్టే ఆయనపై సింపతీ చూపిస్తున్నానని చెప్పారు. తాను ఎందుకు స్పందించానని ప్రశ్నిస్తున్నారని.. తాను కూడా హీరోయిన్నే అని చెప్పారు. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లు చేశానని అన్నారు. ఆడవాళ్లు ఎలా బట్టలు వేసుకోవాలో చెబుతున్నారని.. మీరు ఎలా బట్టలు వేసుకోవాలో చెబుతున్నామా అంటూ మండిపడ్డారు. తన వాయిస్ కారణంగా చాలా మంది హీరోయిన్లు మెచ్చుకుంటారని చెప్పారు. తాము చిన్నపిల్లలం కాదని ఏ బట్టలు వేసుకోవాలో తమకు తెలుసని అన్నారు.






