అనసూయ గ్లామర్ లుక్ వైరల్.. చీరలో హాట్ అట్రాక్షన్

by Pulgam srinivas |

గోల్డ్ ఎంబ్రాయిడరీ చీరలో అనసూయ అందాల హంగామా.

అనసూయ గ్లామర్ లుక్ వైరల్.. చీరలో హాట్ అట్రాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఇటీవల కాలంలో ఆమె టీవీ షోలకు యాంకరింగ్ చేయడం తగ్గించినప్పటికీ, సినిమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు.




అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోషూట్స్‌తో తరచూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.




ఇప్పటికే పలు సందర్భాల్లో చీరకట్టులో తన అందాలతో అలరించిన అనసూయ, తాజాగా మరోసారి అదే లుక్‌లో అభిమానులను ఫిదా చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన తాజా ఫోటోల్లో గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న మెరూన్ రంగు చీరను ధరించింది.




దీనికి ప్రత్యేక ఆకర్షణగా సిల్వర్ కలర్ డిజైనర్ బ్లౌజ్‌ను స్టైలిష్‌గా మ్యాచ్ చేసింది. ఈ లుక్‌లో అనసూయ తన ఫ్రంట్, బ్యాక్ యాంగిల్స్ హైలైట్ అయ్యేలా ఫోటోలకు పోజులిచ్చింది.




అదనంగా పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు స్టైలిష్ రింగ్స్, అలాగే అందంగా మెయింటైన్ చేసిన నెయిల్ పాలిష్‌తో తన లుక్‌ను మరింత గ్లామరస్‌గా మార్చుకుంది. జుట్టును చక్కగా ముడివేసి క్లాసీ లుక్‌ను అందించింది. మొత్తంగా ఈ ఫోటోషూట్‌లో అనసూయ తన స్టైల్ మరియు గ్లామర్‌తో ఆకట్టుకోవడంతో, ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story