- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anasuya Bharadwaj: నెక్ట్స్ సినిమాలో నా పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.. హాట్ యాంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు ఇండస్ట్రీలో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఒకరు

దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఒకరు. జబర్దస్త్ (Jabardast) షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. తర్వాత బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక రామ్ చరణ్ (Ram Charan) ‘రంగస్థలం’ (Rangasthalam) లో రంగమ్మత్త క్యారెక్టర్‌లో లీనమైపోయి యాక్టింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ సినీ రంగంలో కూడా తనకంటూ స్పెషల్ ఈమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ‘పుష్ప’ (Pushpa), ‘పుష్ప-2’ (Pushpa -2)లో దాక్షాయణిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్‌తో అందరిని కట్టిపడేసింది.
ప్రజెంట్ సినిమాలు, టీవీ షోలతో బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న అను బేబీ.. సోషల్ మీడియా(Social media)లో కూడా తన అందాలతో రచ్చ చేస్తుంది. ట్రెండీ ఫొటో షూట్(Trendy photo shoot)లతో రెచ్చిపోతూ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ (Glamour treat) ఇస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న ఈ యాంకరమ్మ.. తన నెక్ట్స్ సినిమాపై హింట్ ఇచ్చింది. రంగమ్మత్త, దాక్షాయణిగా ట్రెండ్ సెట్ చేసిన మీ నెక్ట్స్ ఫీలిమ్స్ ఏంటీ అని యాంకర్స్ ప్రశ్నించగా.. ‘కొన్ని సినిమాలు అయితే సైన్ చేశాను. వాటిలో నేను డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాను. నేను చేసిన సినిమాల్లో అనసూయ అనగానే ఆడియన్స్‌కు నా క్యారెక్టరే గుర్తుకు రావాలని ప్లాన్ చేసుకున్నాను. అలాంటి చిత్రాలే చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఎంటర్‌టైన్‌తో పాటు సర్‌ప్రైజ్ కూడా అవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది.






