- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్లపై అనసూయ సంచలన పోస్ట్
అనసూయ మరో సంచలన పోస్టు చేశారు. హీరోయిన్ తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం అంటూ వ్యాఖ్యానించారు. సొంత దారిలో నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె.. అదే నిజమైన హీరోయిన్ అంటూ డెఫినేషన్ కూడా చెప్పారు. మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అని రాసుకోచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నటుడు శివాజీ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చి వివాదానికి తెర లేపారు అనసూయ. అంతేకాదు అనవసర పంచ్ లు వేసి, సీనియర్ హీరోయిన్ రాశికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ వివాదం చల్లబడిన నేపథ్యంలో మరో సంచలన పోస్టు చేశారు అనసూయ.
ఈ సారి హీరోయిన్ల గురించి కామెంట్స్ చేస్తూ రచ్చ లేపారు. ఇన్ స్టాగ్రామ్ లో స్టేటస్ పెడుతూ హీరోయిన్లు ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. హీరోయిన్ తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం అంటూ వ్యాఖ్యానించారు. సొంత దారిలో నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె.. అదే నిజమైన హీరోయిన్ అంటూ డెఫినేషన్ కూడా చెప్పారు. మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అని రాసుకోచ్చారు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అని మరో చర్చ మొదలైంది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్లిక్






