Ananya Panday: ‘నేను రన్‌వేపై పడుకుని అర్ధరాత్రి అలా చేస్తాను’.. హీరోయిన్ పోస్ట్ వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-03-10 15:03:29  IST  )

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) లైగర్ (Liger)సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

Ananya Panday: ‘నేను రన్‌వేపై పడుకుని అర్ధరాత్రి అలా చేస్తాను’.. హీరోయిన్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) లైగర్ (Liger)సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)సరసన నటించి.. ఈ బ్యూటీ మంచి మార్కులే కొట్టేసింది. కానీ ఈ మూవీ ప్రేక్షకల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఈ బ్యూటీ రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahani), స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 (Student of the Year), పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్(Kho Gaye Hum Kahaan), బాడ్ న్యూజ్ (Bad news), ఖేల్ ఖేల్ మే (Khel Khel May), సీటీఆర్ఎల్ వంటి తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి జనాల మెప్పు పొందింది.

అనన్య పాండే బాలీవుడ్‌లో నటించిన "కంట్రోల్" (Control) అనే సైబర్ థ్రిల్లర్ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. సైబర్ త్రిల్లర్‌గా డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఏకంగా సినిమా నాలుగు భాషల్లో విడుదల చేశారు. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి ట్రైలరే ఈ మూవీపై జనాల్లో భారీ హైప్ పెంచిందని చెప్పుకోవచ్చు.

ఫ్యూచర్‌లో ఏఐ టెక్నాలజీ.. సోషల్ మీడియా.. మనుషుల్ని ఏ లెవల్‌లో ప్రభావితం చేస్తుందో.. దీన్ని ఎలా కంట్రోల్‌ పెట్టాలనే స్టోరీనే దర్శకుడు విక్రమాదిత్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో అనన్య పాండేతో పాటుగావిమాన్ సామ్రాట్ కీలక పాత్రలో నటించాడు. ఇదంతా పక్కన పెడితే.. అనన్య పాండే ఓ వైపు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్‌గానే కనిపిస్తుంటుంది.

తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ హ్యాపీ బర్త్‌డే రిచీ.. మరెవరితోనూ కాదు, నేను రన్‌వేపై పడుకుని అర్ధరాత్రి నక్షత్రాలను చూస్తూ, సెలవు దినాల్లో ఉదయం 8 గంటలకు నిద్రలేచి యోగా క్లాస్ కోసం వెళ్లడం అంటే ఇష్టం’’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో పలు ఫొటోలు కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story