Ananya Panday: ఆ హీరో కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. స్పెషల్ సాంగ్‌లో యంగ్ బ్యూటీ

by Chukka Sudharani |

విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది యంగ్ బ్యూటీ అనన్య పాండే.

Ananya Panday: ఆ హీరో కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. స్పెషల్ సాంగ్‌లో యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది యంగ్ బ్యూటీ అనన్య పాండే. ఫస్ట్ సినిమానే డిజాస్టర్ కావడంతో తెలుగులో మరో మూవీ చేయలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘తు మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తు మేరీ’, ‘చాంద్ మేరా దిల్’ అనే సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లకు ఈ బ్యూటీ తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’.

మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నిఖిల్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హిట్ పడకపోవడంతో.. అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మూవీ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని చూస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ కోసం క్రేజీ బ్యూటీ అనన్య పాండేను సంప్రదించారట మేకర్స్. ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

Next Story