Ananya Panday : నేను మళ్లీ వస్తున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన అనన్య పాండే

by Chukka Sudharani |

యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తుమేరీ’.

Ananya Panday : నేను మళ్లీ వస్తున్నాను అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన అనన్య పాండే
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తు మేరీ మైన్ తేరా మైన్ తేరా తుమేరీ’. కార్తీక్ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదార్ పూనవల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. డిసెంబర్ 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే.. ఈ సినిమా వాయిదా పడినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా.. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ‘నేను మళ్లీ వస్తున్నాను.. ఈ క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న మీ ముందుకు రాబోతున్నాము’ అంటూ ఓ క్యూట్ పోస్టర్ షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. లింక్


Next Story